అలసత్వం వహిస్తే ఓటు గల్లంతే

by Ratna Kumari |

ఓటరు సమగ్ర సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని సాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్ హెచ్చరించారు.

అలసత్వం వహిస్తే ఓటు గల్లంతే
X

దిశ, తుంగతుర్తి : ఓటరు సమగ్ర సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని సాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్ హెచ్చరించారు. తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామంలో మంగళవారం కళాబృందం ఆధ్వర్యంలో ఓటరు సమగ్ర సర్వే సవరణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరు లోగా ఎన్యుమరేషన్ ఫారాలను సంబంధిత బీఎల్‌వోలకు తప్పనిసరిగా అందజేయాలని సూచించారు.

ఆఫ్‌లైన్‌లో ఫారం సమర్పించడం సాధ్యం కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయని పక్షంలో రానున్న ఎన్నికల నాటికి ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించే అవకాశం ఉందని, దీంతో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంటుందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి జిల్లా టీం లీడర్ గంటా బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెల రాము, గడ్డం ఉదయ్, పల్లెల లక్ష్మణ్, ఉపేందర్, మద్దిరాల మంజుల, కుందమల్ల నాగలక్ష్మి, ములకలపల్లి మల్లమ్మ, నెమ్మాది స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Next Story