- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే ఫ్యాన్స్ అంతా ఇలా చేయండి: కేఏ పాల్

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకునే వారికి ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఓ సూచన చేశారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు ఎప్పుడు విదేశాల్లో ఉండే కేఏ పాల్.. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా నిత్యం ఏదో చోట వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాకుండా, భీమ్లానాయక్ మూవీ రిలీజ్‌తో పవన్ కళ్యాణ్ కూడా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు. ఇలాంటి సమయంలో కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
'' పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలన్నా, లేకపోతే మంత్రి కావాలన్నా.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ చెబుతున్నా.. ఒక్క శాతం నీతి, నిజాయితీ ఉన్న.. మీరంతా ప్రజా శాంతి పార్టీలో చేరండి. మీరంతా ఒకే అంటే 42 ఎంపీలు గెలిపించుకుంటే నేనే ప్రధాని అవుతా. పవన్ కళ్యాణ్ కూడా ప్రజా శాంతి పార్టీలో చేరితే ఆంధ్రప్రదేశ్‌కు సీఎంను చేద్దాం'' అంటూ సూచనలు చేశారు. ఆయన కాన్ఫిడెన్స్ చూసి నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.






