Allu Arjun : పుష్ప- 2 విడుదల తర్వాత సంచలన నిర్ణయం తీసుకోనున్న అల్లు అర్జున్.. ఎంటో తెలుసా?

by Kodari Anjali |

డిసెంబరు 5 వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప-2 కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Case filed against allu arjun over sri chaitanya advertisement
X

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబరు 5 వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప-2 (Pushpa-2) కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప-2 పేరే మారుమోగుతుంది. అల్లు అర్జున్(Icon star Allu Arjun) అండ్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్, సాంగ్ ప్రజల్లో భారీ హైప్ పెంచుతున్నాయి. దాదాపు రూ. 2 వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్న అల్లు అర్జున్.. దానికి తగ్గట్లే కష్టపడుతున్నాడని చెప్పుకోవచ్చు.

అయితే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఐకాన్ స్టార్(Icon star) నాన్‌స్టాప్‌గా కష్టపడుతున్నాడు. కాగా పుష్ప-2 విడుదలయ్యాక.. బన్నీ(Bunny) కాస్త బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం కూడా ప్రమోషన్స్‌ అని, ఇంటర్వ్యూలని, ప్రెస్ మీట్లని బిజీబిజీగా గడిపేస్తున్నాడు. కాగా వచ్చే ఏడాది జనవరి(January) నుంచి ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని అనుకుంటున్నాడట. స్నేహారెడ్డి(Snehareddy), అయాన్(Ayān), అర్హ(Arha)తో టూర్లకు వెళ్లి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నట్లు సమాచారం.

ఈలోపు త్రివిక్రమ్(Trivikram) స్టోరీ వర్క్ కూడా పూర్తి అవుతుందని చర్చించుకుంటున్నారు. నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా బాగానే టైమ్ తీసుకుంటుందట. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ మైథాలజికల్(mythological) అని కొంతమంది.. హిస్టారికల్(historical) అని మరికొందరు భావిస్తున్నారు. మంగోలియన్ల నాయకుడు చెంఘీజ్ ఖాన్(Genghis Khan) (Biopic)రాబోతున్నట్లు మూవీలో అల్లు అర్జున్ నటించబోతున్నాడంటూ నెట్టింట జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ స్టోరీ కూడా బన్నీకి బాగా నచ్చిందట. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story