హ్యాపీ బర్త్‌ డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

by Disha Web Desk 2 |
హ్యాపీ బర్త్‌ డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరోగా పరిచయమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి నుంచి వినూత్న సినిమాలు చేస్తూ.. తనదైన స్టైళ్లో దూసుకెళ్తున్నారు. అలా వైకుంఠపురంలో, పుష్ప వంటి వరుస బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. మెగాస్టార్ అల్లుడిగా, అల్లు రామలింగయ్యగారి మనవడిగా, అల్లు అరవింద్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అల్లు అర్జున్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి, ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు(08 -04-2022). ముఖ్యంగా బన్నీకి మలయాళంలో మాంచి క్రేజ్ ఉంది. అక్కడ బన్నీని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు.


అంతేగాక, కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అల్లు అర్జున్‌కే ఎక్కువ అభిమానులు ఉన్నారు అనడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన పనిలేదు. చిరంజీవి హీరోగా నటించిన డాడీ చింత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన బన్నీ సినీ ప్రయాణం, అలా వైకుంఠపురంలో చిత్రం వరకు కేవలం తెలుగు చిత్రాలకే పరిమితమైంది. తాజాగా.. విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పుష్ప-2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ బన్నీ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతున్నారు.


Next Story

Most Viewed