- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తా : ఎమ్మెల్యే వేముల వీరేశం
చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

దిశ, చిట్యాల : చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం చిట్యాల చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గానికి ఆయన శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పాలకవర్గం తమ బాధ్యతగా భావించి, ప్రభుత్వ పరంగా వచ్చే సదుపాయాలను కార్మికులకు అందజేయాలని సూచించారు. కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి కృషి చేస్తూ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు గంజి సుధాకర్, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోకల దేవదాసు, మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు జెరిపోతుల సత్యనారాయణ, కుక్కల మోహన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య యాదవ్, పట్టణ అధ్యక్షుడు ఎద్దులపూరి కృష్ణ, భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జెల్లా మనోహర్, ప్రధాన కార్యదర్శి గంజి వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటి మాధవరెడ్డి, దేశపాక రాజేష్, చేనేత సహకార సంఘం పాలకవర్గ సభ్యులు మిర్యాల వెంకటేశ్వర్లు, కోట రాంబాబు, మిర్యాల ప్రకాష్, వడ్డేపల్లి రాములు, మిర్యాల నరేందర్, సంగిశెట్టి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.






