- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ప్రాంతం ఇచ్చిన రాజకీయ జన్మను ఎప్పటికీ మరువను: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నాకు రాజకీయ గుర్తింపును ఇచ్చి ఇంత పెద్ద నాయకుడిగా చేసిన ఈ ప్రాంత ప్రజలను ఎప్పటికీ మర్చిపోనని.. మరొక జన్మ ఉంటే ఇక్కడే పుట్టి మీ రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు.

దిశ, నార్కట్ పల్లి: నాకు రాజకీయ గుర్తింపును ఇచ్చి ఇంత పెద్ద నాయకుడిగా చేసిన ఈ ప్రాంత ప్రజలను ఎప్పటికీ మర్చిపోనని.. మరొక జన్మ ఉంటే ఇక్కడే పుట్టి మీ రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా జీవిత లక్ష్యం అన్నారు. ఈ ప్రాంతాన్ని ఎప్పటికీ మర్చిపోనని రాజకీయాలకు అతీతంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 4 వేల కోట్ల రూపాయలతో నల్లగొండ జిల్లాలో రోడ్ల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. 76 కోట్ల రూపాయలతో నిర్మించే రైల్వే అండర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును టూరిజం హబ్ గా మార్చుతానని అదేవిధంగా నార్కట్ పల్లి చెరువును మినీ ట్యాంక్ బండగా మార్చేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీటిని అందించి ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా మార్చుతానన్నారు. సేతుబంధు పథకంలో భాగంగా ఈ రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్రంలో ఇదే మొదటిది అన్నారు. 2029 ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ల పెరుగుదలతో 117 సీట్లతో మళ్లీ మనమే అధికారంలోకి వస్తామన్నారు అవసరమైతే 150 సీట్లు సాధించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు.
కెసిఆర్ పార్టీ కేవలం 30 నుంచి 40 సీట్లకే పరిమితం అవుతుందని, బిజెపి సింగిల్ డిజిట్ తోనే కథ ముగిసిపోతుందని జోష్యం చెప్పారు. పార్టీ పేరు మార్పుతోనే కేసీఆర్ బొందలో పడ్డ విషయాన్ని గుర్తు చేస్తున్నానన్నారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు పేరు మార్పుకు ఆలోచించలేదన్నారు. పేరు మార్చినందుకే కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన జిల్లాకు ఏ విధంగా పనులు చేస్తున్నారు నేను సైతం అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నానన్నారు. ఈ ప్రాంతానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీని తీసుకువచ్చానని అదేవిధంగా ఈ ఏడాది మరిన్ని కోర్సులు అదనంగా వచ్చినట్లు పేర్కొన్నారు. ఏ ఆపద వచ్చినా తన వద్దకు వస్తే పార్టీలకు అతీతంగా పనులు చేస్తానన్నారు. పేదింటి బిడ్డలు ఎవరు చదువుకు దూరం కావద్దని అదేవిధంగా ఆసుపత్రులకు తాను అండగా నిలుస్తానన్నారు. మీ అందరి ఆశీర్వాదంతోనే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. నా చిరకాల కోరిక బ్రాహ్మణ సొరంగ మార్గం పూర్తిచేస్తే నా జన్మ ధన్యం అవుతుందన్నారు.
రాష్ట్రంలోనే మన జిల్లాలో అధిక ధాన్యాన్ని పండించినప్పటికీ రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేశామన్నారు. గత పది ఏళ్లుగా ఏ ఒక్కరికి రేషన్ కార్డులు అందించలేదని మండిపడ్డారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామన్నారు. ఈ ప్రజా పాలనలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బి చంద్రశేఖర్, ఆర్డీవో యానాల అశోక్ రెడ్డి, స్థానిక సర్పంచ్ జేరిపోతుల భరత్, మండల పార్టీ అధ్యక్షులు గాయం శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా నాయకులు బత్తుల ఉషయ్య గౌడ్, వడ్డే భూపాల్ రెడ్డి, సర్పంచులు నేతగాని కృష్ణ, ఇల్లందుల కిట్టు, శిర బోయిన రాజు నవ్య, నాయకులు గడుసు శశిధర్ రెడ్డి, పబ్బతి రెడ్డి వెంకట్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, అయిత రాజు యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.






