మెలోనిలో ఆ ఒక్కటీ నచ్చలేదు : ట్రంప్

by Muthe.Rajitha |

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) మంచి వ్యక్తి అని, ఆమె అంటే తనకు ఎంతో అభిమానమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు.

మెలోనిలో ఆ ఒక్కటీ నచ్చలేదు : ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) మంచి వ్యక్తి అని, ఆమె అంటే తనకు ఎంతో అభిమానమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. అయితే, ఇరాన్, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో అమెరికాకు సాయం చేయడానికి ఇటలీ నిరాకరించిందని, ఈ కారణంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తుర్కియే రాజధాని అంకారాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక నాటో (NATO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇటలీ ప్రధాని గురించి విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు.

ఒత్తిడి చేయలేదు కానీ...!

హర్మూజ్ జలసంధి రక్షణ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వకూడదని ఇటలీ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టారు. "హర్మూజ్ విషయంలో మాకు అండగా నిలవడానికి ఇటలీ నిరాకరించింది. అయినప్పటికీ మేము ప్రధాని మెలోనీపై ఎటువంటి ఒత్తిడి తీసుకరాలేదు. కానీ, ఆమె తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ ఒక తప్పిదం" అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అత్యంత కీలకమైన సమయంలో ఇటలీ తమకు అండగా నిలవనందువల్లే తాను కొంత అసంతృప్తికి గురయ్యానని ఆయన బహిరంగంగానే అంగీకరించారు.

సొంత ఇంధన వనరులు ఉన్నాయి

హర్మూజ్ జలసంధిపై అమెరికాకు ఉన్న వ్యూహాన్ని వివరిస్తూ.. తమ దేశానికి స్వంతంగా పుష్కలమైన ఇంధన వనరులు ఉన్నాయని, అందువల్ల తాము ఇంధనం కోసం హర్మూజ్ ప్రాంతంపై ఎంతమాత్రం ఆధారపడటం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఆ ప్రాంతాన్ని కేవలం వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ జలమార్గంగా మాత్రమే చూస్తోందని ఆయన పేర్కొన్నారు. తమకు అవసరం లేకపోయినా అంతర్జాతీయ భద్రత కోసం ప్రయత్నిస్తుంటే, కీలక భాగస్వామి అయిన ఇటలీ సహకరించకపోవడంపై ఆయన నిరాశ వ్యక్తం చేశారు.

Next Story