రాజమౌళి గారు అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు.. యంగ్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-31 05:22:38  IST  )

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అభినవ్ జీవింత్(Abhinav Jivinth) ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

రాజమౌళి గారు అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు.. యంగ్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అభినవ్ జీవింత్(Abhinav Jivinth) ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతో సంచలన విషయాన్ని అందుకుని తన పాపులారిటీని పెంచుకున్నాడు. శశికుమార్, సిమ్రన్, మిథున్ కీలక పాత్రలో నటించి ఈ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా రజనీకాంత్, రాజమౌళి (Rajamouli)లాంటి స్టార్స్ ప్రశంసలు పొందింది. అందరి హృదయాలను కదిలించి, కడుపుబ్బా నవ్వించింది. థియేటర్స్‌లోనే కాకుండా.. ఓటీటీలోనూ మెప్పించింది. ఇక ఇప్పుడు అభిషన్ హీరోగా ఇండస్ట్రీకి బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నాడు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విత్ లవ్’. ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా కనిపించనుండగా.. మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ వేడుకల్లో పాల్గొన్న అభిషన్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ వల్ల వచ్చిన ప్రశంసల గురించి స్పందించాడు. ‘‘నా సినిమాకు రాజమౌళి సార్ ట్వీట్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఆయన వల్లే నా మూవీ తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రం గురించి ట్వీట్ చేసినందుకు చాలా థాంక్స్ సార్ అని అన్నాడు. రాజమౌళి వల్లే ఆ సినిమాకు తనకు ప్రత్యేకంగా గుర్తుందిపోతుందని ఎమోషనల్ అయ్యాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More..

‘స్పిరిట్’ సినిమాలో మరో టాలీవుడ్ హీరో.. పోస్ట్‌తో హింట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

Next Story