నేను ఇప్పటికీ ఇండస్ట్రీలో దాని కోసమే ప్రయత్నిస్తాను: విజయ్ సేతుపతి

by Mallepaka Hamsa |

విలక్షణ నటనతో 'మక్కల్ సెల్వన్'గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కొత్త చిత్రం ‘గాంధీ టాక్స్’(Gandhi Talks)తో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

నేను ఇప్పటికీ ఇండస్ట్రీలో దాని కోసమే ప్రయత్నిస్తాను: విజయ్ సేతుపతి
X

దిశ,సినిమా: విలక్షణ నటనతో 'మక్కల్ సెల్వన్'గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కొత్త చిత్రం ‘గాంధీ టాక్స్’(Gandhi Talks)తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా డబ్బు, వృత్తిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కిశోర్ బెలెకర్ దర్శకత్వంలో మూకీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలైన నేపథ్యంలో, ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి ఒక్కరికీ డబ్బు చాలా ముఖ్యమని, అది ఆహారం లాంటి ప్రాథమిక అవసరమని ఆయన కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు.​డబ్బుతో తనకున్న సంబంధం ఎప్పుడూ మారలేదని, ఇప్పటికీ దాని కోసమే కష్టపడుతున్నానని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.

"మనం కష్టపడి పనిచేసి మంచి ఫలితాన్ని ఇస్తేనే ప్రజలు మనకు తగిన పారితోషికం ఇస్తారు. లేదంటే ఇవ్వరు" అని ఆయన నిజాయితీగా చెప్పారు. కేవలం సంపాదన కోసం మాత్రమే కాకుండా, పని పట్ల అంకితభావం ఉండాలని, అప్పుడే మనకు గుర్తింపుతో పాటు ఆర్థిక భద్రత లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఆనందాన్ని డబ్బుతో ముడిపెట్టడం సరికాదని ఈ సందర్భంగా విజయ్ సూచించారు. ‘‘పనులే మనకు అసలైన ఆనందాన్ని ఇస్తాయి, మనం పొరపాటుగా ఆ సంతోషాన్ని డబ్బుతో పోలుస్తున్నాం’’ అంటూ జీవిత సత్యాన్ని వివరించారు. అదితిరావు హైదరి, అరవింద్ సామి ప్రధాన పాత్రల్లో నటించిన ‘గాంధీ టాక్స్’ చిత్రంలో కేవలం హావభావాలతోనే మెప్పించిన విజయ్, తన మాటలతో కూడా ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story