కోమటిరెడ్డిపై దుష్ప్రచారంతో నాకు తిండి పోతలేదు.. MLA అనిరుధ్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-16 12:14:52  IST  )

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనకు దేవుడితో సమానమని.. అలాంటి వ్యక్తిపై దుష్ప్రచారం చేస్తుండటంతో తనకు మూడు రోజులుగా తిండిపోతలేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డిపై దుష్ప్రచారంతో నాకు తిండి పోతలేదు.. MLA అనిరుధ్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) తనకు దేవుడితో సమానమని.. అలాంటి వ్యక్తిపై దుష్ప్రచారం చేస్తుండటంతో తనకు మూడు రోజులుగా తిండిపోతలేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudha Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ కార్యక్రమానికి హజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో తన కొడుకుతో మూడు రోజులు హాలిడేకు వెళ్లానని.. కోమటిరెడ్డిపై టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తలు తనను ఎంతగానో బాధించాయని అన్నారు. ‘ఇంత విషమిచ్చిన చంపేయండి’ అంటూ కోమటిరెడ్డి అనడంతో ఇంకా బాధపడ్డానని అన్నారు. సన్నిహితుడిగా ఆయన కొన్నేళ్లుగా తనకు తెలుసని.. శ్రీరామచంద్రుడి లాంటి వాడని కామెంట్ చేశారు. అలాంటి వ్యక్తిపై అభాండాలు వేయడం సరికాదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మంత్రి పదవిని త్రుణప్రాయంగా వదులుకుని పోరాటం చేసి వ్యక్తి కోమటిరెడ్డి అన్నారు. ఓ మీడియా ఛానల్ ప్రసారం చేసిన కథనంపై ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే నిజానిజాలు బటయటకు వస్తాయని అనిరుధ్ రెడ్డి అన్నారు.

Next Story