నేను నెహ్రూను గుడ్డిగా అభిమానించను.. ఎంపీ శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

భారత మాజీ ప్రధాని జవవహర్‌లాల్ నెహ్రూ‌ను తాను గుడ్డిగా అభిమానించనని, గతంలో ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలను 100 శాతం ఆమోదించలేనని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

నేను నెహ్రూను గుడ్డిగా అభిమానించను.. ఎంపీ శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని జవవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)ను తాను గుడ్డిగా అభిమానించనని, గతంలో ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలను 100 శాతం ఆమోదించలేనని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్(KLIBF)‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలంగా స్థాపించిన వ్యక్తిగా నెహ్రూ పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని అన్నారు. ఆయన ఆలోచనా దృక్పథం, మేధస్సును తాను ఎంతగానో అభిమానిస్తానని అన్నారు. కానీ, తాను నెహ్రూను గుడ్డిగా అభిమానించనని, గతంలో ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలను 100 శాతం ఆమోదించలేనని స్పష్టం చేశారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమికి కొంత వరకు నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

నెహ్రూ వారసత్వాన్ని తుడిచివేయాలని చూస్తున్నారు..

ఇక ప్రస్తుతం నరేంద్ర మోడీ (Narendra Modi) సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం జవహర్‌లాల్ నెహ్రూ వారసత్వాన్ని తుడిచివేయాలని చూస్తోందని విమర్శించారు. నేడు దేశంలో ఏ సమస్య వచ్చినా దానికి నెహ్రూనే బాధ్యుడిని చేస్తూ ఆయనను ఒక బలిపశువుగా మారుస్తున్నారని మండిపడ్డారు. వారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాకపోయినా.. నెహ్రూ సిద్ధాంతాలకు మాత్రం కచ్చితంగా వ్యతిరేకమని చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Next Story