i20 మోడల్‌లో రెండు కొత్త వేరియంట్‌లు లాంచ్ చేసిన హ్యుందాయ్

by Disha Web Desk 17 |
i20 మోడల్‌లో రెండు కొత్త వేరియంట్‌లు లాంచ్ చేసిన హ్యుందాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: హ్యుందాయ్ ఇండియాలో కొత్తగా i20 మోడల్‌ను విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. i20 రెండు వేరియంట్లు 1.2L Asta (O) CVT, 1.0 Sportz DCT. హ్యుందాయ్ ప్రస్తుతం తన ఐ20 వేరియంట్లలో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ i20 Asta (O) 1.2 CVT i20 పెట్రోల్ టాప్ స్పెక్ వేరియంట్. ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ను పొందుతుంది. హ్యుందాయ్ i20 Asta (O) 1.2 CVT ధర రూ. 10.51 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). హ్యుందాయ్ i20 ఇతర కొత్త వేరియంట్ 1.0 టర్బో DCT స్పోర్ట్జ్. దీని ధర రూ.9.76 లక్షలు. ఐ20 స్పోర్ట్జ్ వేరియంట్‌లో ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్‌ ఉంటుంది. ఇంతకుముందు వేరియంట్‌లో మాన్యువల్ ఏసీ మాత్రమే ఉండేది. భారతీయ మార్కెట్లో, హ్యుందాయ్ i20 మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, హోండా జాజ్, టయోటా గ్లాంజా వంటి వాటితో పోటీపడుతుంది.


Next Story