- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెలిఫోన్ కాలనీలో పార్క్‌ను కాపాడిన హైడ్రా
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లోని టెలిఫోన్ కాలనీలో ఆక్రమణలకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టారు.

దిశ, మేడిపల్లి: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లోని టెలిఫోన్ కాలనీలో ఆక్రమణలకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టారు. పార్క్ స్థలాన్ని భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలకు గురి కాకుండా మంగళవారం కంచె ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు.కాలనీవాసుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు హైడ్రా సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలోని అధికారులు పార్క్ స్థలాన్ని పరిశీలించి, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టారు.
ప్రజా ఆస్తులను కాపాడేందుకు పార్క్ చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా టెలిఫోన్ కాలనీ వాసులు హైడ్రా అధికారుల చర్యలను అభినందించారు. ప్రజల కోసం కేటాయించిన పార్క్ స్థలాన్ని పరిరక్షించినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ఆస్తుల సంరక్షణలో ఇదే తరహా చర్యలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైడ్రా సీఐ రాజశేఖర్, మేడిపల్లి ఎస్ఐ తిరుపతి,డీఆర్ఎఫ్ టీం సభ్యులు, మేనేజర్లు జైపాల్ రెడ్డి, చంటి, అలాగే టీం సభ్యులు నాగరాజు, పవన్, రామ్ కుమార్, గణేష్, శ్రీకాంత్, శివలింగం, సందీప్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.






