- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది: Kayadu Lohar
నేను నా జీవితంలో మొదటిసారి చెన్నైకి వెళ్ళింది ఈ ‘ఇదాయం మురళి’ సినిమా కోసమే.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ కాయదు లోహర్ ‘డ్రాగన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల ఫంకీ, పల్లి చట్టంబి వంటి చిత్రాలు చేసినప్పటికీ అమ్మడు ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయారు. అయినప్పటికీ కాయదుకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన చాన్స్ దక్కించుకుంటున్నారు. టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని సరసన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్న కాయదు.. కోలీవుడ్‌లో ‘ఇమ్మోర్టల్’, ‘ఇదాయం మురళి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అథర్వ మురళి హీరోగా, ఆకాష్ బాస్కరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇదాయం మురళి’ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న కాయదు లోహర్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. సినిమా జర్నీ గురించి కాయదు లోహర్ మాట్లాడుతూ.. "నేను నా జీవితంలో మొదటిసారి చెన్నైకి వెళ్ళింది ఈ ‘ఇదాయం మురళి’ సినిమా కోసమే. దాదాపు మూడు, నాలుగు సంవత్సరాల క్రితమే నేను ఈ ప్రాజెక్ట్‌కు సంతకం చేశాను. ఇంత అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నా మొదటి తమిళ చిత్రం కావడం వల్ల అంతా చాలా సజావుగా, పర్ఫెక్ట్‌గా సాగిపోయింది" అని చెప్పారు. కథ గురించి చెబుతూ.. "ఈ చిత్రంలోని కథ అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. తమిళ చిత్ర పరిశ్రమలో వన్ సైడ్ ప్రేమకథగా నిలిచిపోయిన ఐకానిక్ మూవీ 'ఇదయం' వాతావరణాన్ని ఈ సినిమా ద్వారా పునఃసృష్టించడానికి చిత్ర బృందం ప్రయత్నించింది. పాత్రల మధ్య ఉండే నిజమైన, వాస్తవిక సంబంధాలను ఇందులో చాలా చక్కగా చిత్రీకరించారు" అని ఆమె పేర్కొన్నారు.






