- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం: టీఎస్‌ఎస్‌ఏ
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్(టీఎస్‌ఎస్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడు కూరెల్ల మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, చంపాపేట్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్(టీఎస్‌ఎస్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడు కూరెల్ల మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఆలస్యం చేయడం వల్ల వేలాది మంది ఉన్నత విద్య కొనసాగించలేని పరిస్థితి నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మలక్‌పేట్‌లోని టీఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8 వేల కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇంకా విడుదల కాకపోవడం దురదృష్టకరమన్నారు.
ఈ బకాయిలు చెల్లించక పోవడం వల్ల విద్యార్థులు కళాశాలల్లో ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ, బకాయిల చెల్లింపులో మాత్రం జాప్యం కొనసాగడం ఆందోళన కలిగించే అంశమని ఆయన విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని వెంటనే విడుదల చేసి విద్యార్థుల్లో నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని కోరారు. అదే విధంగా రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని, ప్రభుత్వ హాస్టళ్ల భవనాల అద్దె బకాయిలు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై త్వరితగతిన స్పందించకపోతే రానున్న పక్షం రోజుల్లో తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూరెల్ల మహేష్ కుమార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కొట్ర ప్రభాకర్ రెడ్డి, నిమ్మల లెనిన్, అరుణ్ కుమార్, వెంకటేష్, గోపి, నాని తదితర విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






