- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏమాత్రం స్లో కాని అనిల్ రావిపూడి.. అప్పుడే ఆ పోర్షన్స్ పూర్తి
వెంకీ –కళ్యాణ్ రామ్‌లతో అనిల్ తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తైనట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమాలను పూర్తి చేసే దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన పని చేసే విధానం ఇతర దర్శకులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఒక సినిమా పూర్తయ్యాకే తదుపరి హీరోలను ఫైనల్ చేసి, కథ, స్క్రీన్‌ప్లేను పూర్తిగా సిద్ధం చేసుకున్న తర్వాతే షూటింగ్‌ను ప్రారంభిస్తారు. దీంతో షూటింగ్ మొదలైన తర్వాత జెట్ స్పీడ్‌లో చిత్రీకరణ పూర్తవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా ముగియడం, సినిమా అనుకున్న సమయానికే విడుదల కావడం జరుగుతుంది. ఈ వేగవంతమైన ప్రణాళిక వల్ల నిర్మాతలపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ఇండస్ట్రీలో అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే అనిల్ రావిపూడి తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఆయన వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనప్పటికీ, ఇప్పటికే ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తైనట్లు సమాచారం. ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జూలై 2 నుంచి ఈ సినిమా షూటింగ్‌లో వెంకటేష్ కూడా పాల్గొననున్నారని సమాచారం. నవంబర్ నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలని అనిల్ రావిపూడి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించగా, ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






