- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింధూ జలాల పై పాక్ మంత్రి గప్పాలు.. చేతులు నరికేస్తాం’ అంటూ బీరాలు
సింధూ జలాల వ్యవహారంలో భారత్‌పై పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ ప్రగల్భాలు.. 'ఆపరేషన్ సిందూర్' గుర్తులేదా అంటూ నెటిజన్ల ఘాటు కౌంటర్!

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) వివాదంపై భారత్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత్ తమ జల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. "పొరుగు దేశ ప్రధాని (నరేంద్ర మోడీ) చేతిలో ఒక టాప్ (నల్లా) ఉంది.. ఆయన పాకిస్తాన్‌కు చుక్క నీరు కూడా వెళ్లకుండా ఆపేస్తామంటున్నారు. ఒకవేళ ఎవరైనా మా నీటిపై చేయి వేయాలని చూస్తే, ఆ చేతులను నరికేస్తాం" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ 1960 నాటి ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం (Abeyance) పై పాక్ మంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నక్క ఎంత అరిచినా పులి అవ్వదు - నెటిజన్ల ట్రోల్స్
పాక్ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. "ఎంత అరిచినా నక్క ఎప్పటికీ పులి కాలేదు" అంటూ పాకిస్తాన్‌ను ఎద్దేవా చేస్తున్నారు. గతేడాది మే (2025) లో భారత్ ఉగ్రవాద స్థావరాలపై జరిపిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) ను గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం బ్రహ్మోస్, స్కాల్ప్ క్షిపణులతో పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను ఎలా ధ్వంసం చేసిందో, అప్పుడు పాక్ సైన్యం ఎలా చేతులెత్తేసిందో మర్చిపోయావా అంటూ మంత్రి ముసాదిక్ మాలిక్‌కు నెటిజన్లు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు.






