- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో రెండు చెరువులకు పూర్వవైభవం.. పూర్తయిన సుందరీకరణ పనులు పూర్తి
హైడ్రా ఆధ్వర్యంలో బమృకున్-ఉద్-దౌలా, నల్ల చెరువుల సుందరీకరణ పూర్తి. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మరో రెండు చెరువుల సుందరీకరణ ప నులు పూర్తయ్యాయి. పాతబస్తీలోని బమృకున్ - ఉద్- దౌలా చెరువుతో పాటు.. కూ కట్‌పల్లిలోని నల్ల చెరువు పున:ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 6వ తేదీన బమృకున్ - ఉద్ - దౌలా చెరువును ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మరో నాలుగైదు రోజుల్లో కూకట్‌ప ల్లి నల్ల చెరువును సీఎం రేవంత్‌రెడ్డి నగర ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. హై డ్రా మొదటి విడుతగా చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికే అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట గతేడాది సెప్టెంబర్ 28న పున:ప్రారంభించారు. మరో మూడు చెరువులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి తోడు రెండో విడుత మరో 14 చెరువులను హైడ్రా అభివృద్ధి చే యడానికి కసరత్తు చేస్తోంది.
పాతబస్తీకి మణిహారం.. బమృకున్ - ఉద్- దౌలా
పాతబస్తీకి మణిహారం చారిత్రక బమృకున్ - ఉద్- దౌలా చెరువు. పాతబస్తీలో ని జాంల నాటి చారిత్రక చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. చరిత్రను తవ్వితీసిన మాదిరి చెరువును రూపొందించి చారిత్రక వైభవా న్ని చాటింది. ఒకవైపు ఉన్న నాటి కట్టను మరింత పటిష్టం చేసి వాకింగ్ ట్రాక్‌ను ని ర్మించింది. కట్టపై ఓపెన్ జిమ్‌ను పెట్టి అన్ని వయసులవారి ఆరోగ్యానికి బాటలు వేసిం ది. చెరువు లోపలి వైపు ఫెన్సింగ్ పనులను పూర్తి చేసింది. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలను అభివృద్ధి చేసింది. వృద్ధులు సేద దీరేందుకు గజబోలు నలువైపులా నిర్మించింది. ఔషధగుణాలున్న మొ క్కలతో పాటు.. నీడనిచ్చే చెట్లను నాటారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. హైడ్రా ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.
విహార కేంద్రంగా..
పాతబస్తీలో నేషనల్ పోలీస్ అకాడమీకి చేరువలో అభివృద్ధి చేస్తున్న బమృకున్-ఉ ద్-దౌలా చెరువు విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతం లో పలుమార్లు సందర్శించినప్పుడు అధికారులను ఆదేశించారు. పచ్చిక బయళ్లతో పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నా రు. బయటకు చెరువు పరిసరాల్లో ఉన్న ఉ ష్ణోగ్రతల్లో తేడా తెలిసేలా.. పచ్చని వాతావ రణం ఉండేలా చూడాలన్నారు. నిజాంల కా లంలో చెరువు నిర్మాణంలో వాడిన రాతిని వినియోగించి కట్టడాన్ని పటిష్టం చేయాల న్నారు. ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్‌లు విశాలంగా ఉండేలా చూడాలన్నారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్ ఇలా 10 కిలోమీటర్ల మేర చె రువుకు వర్షం నీరు వచ్చేలా ఇన్‌లెట్లు నిర్మిం చాలని.. వరద కష్టాలకు ఈ చెరువు చెక్‌పెట్టేలా చూడాలని సూచించారు.
కూకట్‌పల్లి నల్లచెరువు..
ఎటు చూసినా నివాసాలు.. వరద నీరు ఎటు వెళ్లాలో తెలియని నిర్మాణాలు. కూకట్‌పల్లి నల్లచెరువు ఆక్రమణలకు గురై బిక్కుబిక్కుమంటున్న తరుణంలో హైడ్రా దృష్టి ఆ చెరువుపై పడింది. 2024 సెప్టెంబరులో ఆక్రమణలు తొలగించినప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన సమాచారంతో ఆక్రమణలను తొలగించే పనిని చేపట్టింది. చెరువులోకి జరిగి ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్డులను తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలతో పాటు దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడమే కాకుండా.. 3 మీటర్లకు పైగా మట్టిని తొలగించింది.
16 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువు 30 ఎకరాలకు విస్తరించుకుంది. ఒకప్పుడు ఎలా ఉండేది... నేడు ఎలా అభివృద్ధి చెందింది అనేది చూడాలనుకుంటే కూకట్‌పల్లి నల్లచెరువును సందర్శించాల్సిందే. అక్కడ నివాసం ఉన్న వారే అచ్చెరవొందేలా చెరువు తయారయ్యింది. బోటు షికారుతో ఆహ్లాదాన్ని పంచుతోంది. ఎన్ని ప్రయాసలో.. ఎన్ని ఎదురు దెబ్బలో.. మరెన్ని విమర్శలో.. వీటన్నిటినీ తట్టుకుని పని చేసిన హైడ్రా కష్టానికి దక్కిన ఫలితమిది. చెరువు అభివృద్ధిపట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






