- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరాలం చెరువులో చిక్కుకున్న 9 మంది కార్మికులను రక్షించిన హైడ్రా
హైడ్రా పని తీరుకు నెట్టింట్లో ప్రశంసలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా పని తీరుకు నెట్టింట్లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మీర్ ఆలం ట్యాంక్‌లో చిక్కుకున్న కార్మికులను హైడ్రా రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం మీరాలం చెరువులో వ్యర్థాలను తొలగించడానికి వెళ్లిన 9 మంది కార్మికులు, తిరిగి వచ్చే క్రమంలో బోట్ ఇంజిన్ పనిచేయకుండా పోవడంతో చెరువు మధ్యలోనే చిక్కుకుపోయారు. చుట్టూ చీకటి, దట్టమైన పేరుకుపోయిన గుర్రపుడెక్క, మొసళ్ల భయం ఉండటంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కార్మికులు డయల్-100కు కాల్ చేయడంతో HYDRAA మరియు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు వెంటనే స్పందించి రంగంలోకి దిగాయి.
అర్ధరాత్రి తర్వాత కూడా చీకటిలోనే బోట్‌లతో వెళ్లి రెండు దశల్లో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఈ రక్షణ ఆపరేషన్‌లో ఎవరికీ గాయాలు కాకుండా అందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లోనూ ధైర్యంగా పని చేసిన HYDRAA బృందాన్ని ప్రజలు, నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.






