- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ లోన్ డేంజర్ బెల్స్.. తీవ్రంగా పడిపోయిన గాలి నాణ్యత
దేశ రాజధాని ఢిల్లీతో పాటు అనేక ప్రముఖ నగరాల్లో వాయుకాలుష్యం తీవ్రంగా పెరుగుతుంది. దీంతో గాలి నాణ్యత తీవ్రంగా పడుతుండటంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీతో పాటు అనేక ప్రముఖ నగరాల్లో వాయుకాలుష్యం (air pollution) తీవ్రంగా పెరుగుతుంది. దీంతో గాలి నాణ్యత తీవ్రంగా పడుతుండటంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో కూడా వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా గాలి నాణ్యత లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతుండగా.. శనివారం తెల్లవారుజామున సికింద్రాబాద్ పరిధిలో గాలి నాణ్యత సూచీ (AQI) 240కి చేరుకుంది. ఇది ఆరోగ్యానికి హానికరమైన (Unhealthy) స్థాయిగా పరిగణించబడుతుంది. సాధారణంగా రెండంకెల సంఖ్యలో ఉండాల్సిన ఈ సూచీ, శీతాకాలపు పొగమంచు, కాలుష్య కారకాల వల్ల భారీగా పెరిగింది.
నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ నుండి వెలువడే పొగ, నిర్మాణ పనుల వల్ల గాలిలో కలిసే ధూళి కణాలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం వంటివి కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు. దీనికి తోడు శీతాకాలంలో వీచే చల్లటి గాలి, పొగమంచు కాలుష్య కారకాలను భూమికి దగ్గరగా ఉండటం వల్ల గాలి నాణ్యత మరింత క్షీణిస్తోంది. అయితే, గత 15 రోజులతో పోలిస్తే కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత స్వల్పంగా మెరుగుపడినట్టు గణాంకాలు చూపిస్తున్నాయి.
వైద్యుల హెచ్చరికలు - జాగ్రత్తలు
నగరంలో గాలి నాణ్యత పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, సైనసైటిస్, అలర్జీలతో బాధపడేవారు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు తెల్లవారుజామున మరియు రాత్రి వేళల్లో బయట తిరగకపోవడమే మంచిదని, వీలైనంత వరకు బహిరంగ వ్యాయామాలను పరిమితం చేసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.
Read More..






