IPL 2022: చెన్నైపై ఘన విజయం సాధించిన హైదరాబాద్..

by Disha Web Desk 19 |
IPL 2022: చెన్నైపై ఘన విజయం సాధించిన హైదరాబాద్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన హైదరాబాద్ 2వికెట్లు కోల్పోయి.. మరో 14బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 75పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి రాణించడంతో ఎస్ఆర్‌హెచ్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈ సీజన్‌లో వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది.



Next Story