2034 నాటికి హైదరాబాద్ 'నెట్ జీరో సిటీ'.. ధరిత్రి దినోత్సవ వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు

by Malleboina Mahesh |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరిత్రి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ను 2034 నాటికి నెట్ జీరో సిటీగా మార్చడమే లక్ష్యమని తెలిపారు.

2034 నాటికి హైదరాబాద్ నెట్ జీరో సిటీ.. ధరిత్రి దినోత్సవ వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకృతిని, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం జీవరాశి మనుగడకు అత్యంత ఆవశ్యకమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సందేశమిస్తూ, 2034 నాటికి హైదరాబాద్‌ను కర్బన ఉద్గార రహిత (Net Zero) నగరంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని పిలుపునిచ్చిన ఆయన, పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణలో మూడు జోన్ల వారీగా 'గ్రీన్ స్ట్రాటజీ'ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించడం, ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles)ను భారీగా ప్రోత్సహించడం మరియు గ్రీన్ ఎనర్జీ (Green Energy) వినియోగం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం వివరించారు. హరిత వనాల పెంపు, చెరువుల పరిరక్షణతో పాటు మూసీ నది పునరుద్ధరణ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా పర్యావరణ సుస్థిరతను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రవాణా వ్యవస్థను పర్యావరణహితంగా మార్చడం ద్వారా భావి తరాలకు స్వచ్ఛమైన తెలంగాణను అందించడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story