- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ట్రంప్ అవెన్యూ’పై డొనాల్డ్ ట్రంప్ హర్షం
హైదరాబాద్ నగరంలో తన పేరుతో ఓ ప్రధాన రహదారికి నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలో తన పేరుతో ఓ ప్రధాన రహదారికి నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పేరు పెట్టడంపై ఆయన ప్రత్యేకంగా స్పందించారు. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో ‘భారతదేశంలోని హైదరాబాద్‌లో కొత్తగా డోనాల్డ్ ట్రంప్ అవెన్యూను ఏర్పాటు చేశారు. ఈ విధంగా గౌరవించబడిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిని నేనే. ధన్యవాదాలు’అని డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్, నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్ లో ఈనెల 23న జరిగిన అమెరికా 250 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ రహదారి నామఫలకాన్ని అమెరికా రాయబారి సెర్జియో గోర్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ల సమక్షంలో లాంఛనంగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే.






