- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, కీసర: కీసర రాక్ ఫోర్ట్ వెంచర్‌లో మధ్యాహ్న సమయంలోనే దొంగలు కిషన్ రెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి, ఇంట్లో ఉన్న బంగారం-వెండి-నగదు ఎత్తుకెళ్లారు. కిషన్ రెడ్డి కీసరలో ఉన్న తన మెడికల్ షాప్ క్లోజ్ చేసుకొని మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి తళాలు పగుల గొట్టి ఉన్నాయి. చూసి షాక్ కి గురై అయ్యాడు. ఇంట్లో దొంగతనం జరిగింది అని గమనించిన కిషన్ రెడ్డి వెంటనే 100 కి డాయిల్ చేసి కీసర పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం ఎలా జరిగింది అని పరిశీలించి చుట్టూ పక్కల ఉన్న వారిని వివరాలు అడిగితెలుసుకున్నారు. ఇంటి ఆవరణలో మెట్ల కింద ఉన్న గునపంతో ఇంటితాళాలు పగుల గొట్టారు అని పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఉన్న బీరువాలో నుండి తులం బంగారం, నాలుగు తులల వెండి, 40000/- నగదు పోయినట్టు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






