‘రావణా సందనాల’ అంటూ ఇరదీసిన లెనిన్

by Chukka Sudharani |

ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది ‘లెనిన్’ సినిమా.

‘రావణా సందనాల’ అంటూ ఇరదీసిన లెనిన్
X

దిశ, సినిమా: ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది ‘లెనిన్’ సినిమా. అక్కినేని హీరో అఖిల్, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ మూవీకి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. అఖిల్ కెరీర్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే విడుదల సమయం దగ్గర పడుతుండగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు తాజాగా లెనిన్ నుంచి ‘రావణా సందనాల’ అంటూ సాగే మాస్ జాతర సాంగ్ స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. లిరిక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు ఫుల్ ఎనర్జీని ఇచ్చే అఖిల్ డ్యాన్స్‌తో ఈ ప్రోమో వైరల్ అవుతూ నెట్టింట ఆకట్టుకుంటోంది.

Next Story