- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటరు ఎన్యూమరేషన్ పూర్తి చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం వలిగొండలోని తమ నివాసంలో ఓటరు వివరాల ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు.

దిశ, వలిగొండ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం వలిగొండలోని తమ నివాసంలో ఓటరు వివరాల ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు, బూత్ లెవల్ అధికారులకు తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను అందజేసి నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను పరిశీలించి ఎన్యూమరేషన్ ప్రక్రియకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌వోలు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం, వివరాల్లో పొరపాట్లు లేదా లోపాలు కనిపిస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరి చేయాలని సూచించారు. ప్రతి బూత్‌లో పార్టీ నాయకులు బూత్ కమిటీల సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి, తహసీల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






