- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ స్టార్టప్ ‘UDrivo’ సరికొత్త విప్లవం!
హైదరాబాద్ స్టార్టప్ ‘UDrivo’ యాప్‌తో నిమిషాల్లోనే వెరిఫైడ్ కార్ డ్రైవర్ల బుకింగ్ సౌకర్యం.. డ్రైవర్లకు నెలకు ₹60,000 వరకు సంపాదించే గోల్డెన్ ఛాన్స్!

దిశ, వెబ్ డెస్క్: సొంత కారు ఉండి, అత్యవసర సమయాల్లో డ్రైవర్ దొరక్క ఇబ్బంది పడే వాహనదారులకు సరికొత్త సాంకేతిక పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ సామాజిక సేవకులు మేరుగు అశోక్ సారథ్యంలో, తుప్పరి సుహాసిని మేనేజింగ్ డైరెక్టర్‌గా, కొక్కరకొండ మౌనిక డైరెక్టర్‌గా, కొక్కరకొండ సుధాకర్ సిఈఓ (CEO) గా వ్యవహరిస్తున్న హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ సంస్థ ‘UDrivo’ యాప్ దేశవ్యాప్తంగా కార్ డ్రైవర్ హైరింగ్ సేవలను వేగంగా విస్తరిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా వినియోగదారులు కేవలం నిమిషాల్లోనే సురక్షితమైన, వెరిఫైడ్ ప్రొఫెషనల్ కార్ డ్రైవర్లను బుక్ చేసుకోవచ్చు. డ్రైవర్ ఎంత సమయం సేవలు అందిస్తే, అంత సమయానికి మాత్రమే చెల్లించే పారదర్శక ధరల విధానాన్ని (Pay-per-minute) ఈ సంస్థ అమలు చేస్తోంది.
డ్రైవర్లకు నెలకు ₹60,000 వరకు సంపాదన..
ఇప్పటివరకు అసంఘటితంగా ఉన్న కారు డ్రైవర్ల నియామక రంగాన్ని సాంకేతికతతో అనుసంధానించి సంఘటిత రంగంగా మార్చడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యమని ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతానికి 25,000 మందికి పైగా డ్రైవర్లు ఈ యాప్‌లో నమోదు చేసుకోగా, వారిలో 5,500 మందికి పైగా పూర్తి వెరిఫైడ్ ప్రొఫెషనల్ డ్రైవర్లతో దేశంలోని ప్రధాన నగరాల్లో సంస్థ విజయవంతంగా సేవలను అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా పనిచేసే డ్రైవర్లు వారి పని గంటలు మరియు డిమాండ్‌ను బట్టి నెలకు ₹60,000 వరకు గౌరవప్రదమైన, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. రాబోయే ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా మరో 1 లక్ష మంది ప్రొఫెషనల్ డ్రైవర్లను తమ ప్లాట్‌ఫారమ్‌లో ఆన్‌బోర్డ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.






