చిల్లర కష్టాలకు చెక్.. అందుబాటులోకి రానున్న హైబ్రిడ్ ఏటీఎంలు!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-01 02:27:18  IST  )

దేశవ్యాప్తంగా సామాన్యుల చిల్లర కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా 'హైబ్రిడ్ ఏటీఎంలను ప్రవేశ పెట్టేందుకు కసరత్తు ప్రారంభం అయింది.

చిల్లర కష్టాలకు చెక్.. అందుబాటులోకి రానున్న హైబ్రిడ్ ఏటీఎంలు!
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సామాన్యుల చిల్లర కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా 'హైబ్రిడ్ ఏటీఎంలను (Hybrid ATMs) ప్రవేశ పెట్టేందుకు కసరత్తు ప్రారంభం అయింది. ఈ వినూత్న యంత్రాల ద్వారా రూ.500 వంటి పెద్ద నోట్లను డిపాజిట్ చేసి, వాటికి బదులుగా రూ.10, రూ.20, రూ.50 నోట్లతో పాటు నాణేలను కూడా పొందవచ్చు. ప్రస్తుతం సాధారణ ఏటీఎంలలో ఎక్కువగా రూ.500, 200, 100 నోట్లే అందుబాటులో ఉండటం తో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముంబై వంటి నగరాల్లో వీటిని పైలట్ ప్రాజెక్టు కింద పరీక్షిస్తుండగా, త్వరలోనే రద్దీగా ఉండే నగర ప్రాంతాలన్నింటిలోనూ వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు గాను, చిన్న కరెన్సీ నోట్ల ముద్రణను భారీగా పెంచాలని కేంద్రం త్వరలో ఆర్బీఐ (RBI)ని కోరనుంది. మార్కెట్‌లో చిన్న నోట్ల కొరత లేకుండా చూడటం ద్వారా రోజువారీ చిన్న చిన్న లావాదేవీలను సులభతరం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం గా తెలుస్తుంది.. డిజిటల్ చెల్లింపులు అందుబాటులో ఉన్నప్పటికీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిల్లర నగదుకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ హైబ్రిడ్ ఏటీఎంల నెట్‌వర్క్‌ను విస్తరించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.

Read More..

రోటీన్ ఖర్చులకు అప్పులు చేస్తున్న రాష్ట్రాలు.. ఎకనామిక్ సర్వేలో కీలక విషయాలు వెల్లడి!

Next Story