బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్త హత్య

by Muthe.Rajitha |

బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తను హత్య చేసిన ఘటన ఏపీలో తీవ్ర సంచలనం రేపింది.

బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్త హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తను హత్య చేసిన ఘటన ఏపీలో తీవ్ర సంచలనం రేపింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్య లక్ష్మీమాధురితో పాటు గోపీ, ఆర్‌ఎంపీ సురేశ్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. లక్ష్మీమాధురికి, లోకం నాగరాజుకు 2007లో వివాహం జరగగా.. ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల కారు ట్రావెల్స్ యజమాని గోపితో వివాహేతర సంబంధం ఉండటంతో, భర్తను అడ్డు తొలగించేందుకు పథకం వేశారు.

RMP సురేశ్‌ వద్ద నుంచి నిద్రమాత్రలు తీసుకుని, వాటిని బిర్యానీలో కలిపి శివనాగరాజుకు పెట్టి, నిద్రమత్తులో ఉన్న సమయంలో అప్పడాల కర్రతో గుండెపై కొట్టి చంపారు. ఈ నెల 18న శివనాగరాజు అనుమానాస్పద మృతి కేసు నమోదు కాగా, శవపరీక్షలో ఛాతీ ఎముకలు విరిగినట్లు తేలడంతో.. అసలు విషయం బయట పడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు.

Next Story