వివాహేతర సంబంధం.. తల్లిని తండ్రే చంపేశాడని తెలిసిన పిల్లలు ఏం చేశారంటే?

by Gantepaka Srikanth |

కృష్ణాజిల్లా పెనమలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది.

వివాహేతర సంబంధం.. తల్లిని తండ్రే చంపేశాడని తెలిసిన పిల్లలు ఏం చేశారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా(Krishna District) పెనమలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి(Extramarital Affair) అడ్డు వస్తోందని ప్రియురాలు ఝాన్సీతో కలిసి భార్య దేవిని భర్త ప్రసాద్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన గతేడాది మే 19వ తేదీన జరిగింది. అయితే.. ఇన్నిరోజులు భార్యది సహజ మరణంగా బంధువులు, గ్రామస్తులను ప్రసాద్ నమ్మిస్తూ వచ్చాడు. తాజాగా ఫోన్‌లో కాల్ రికార్డింగ్స్ విని పిల్లలు షాక్ అయ్యారు. తండ్రే.. తల్లిని చంపేశాడనే విషయం తెలిసి ఆ పిల్లలు జీర్ణించుకోలేకపోయారు. స్వయంగా కుమారుడే తండ్రి ప్రసాద్‌పై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story