- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊసరవెల్లి కాదు, పిట్ట మారుస్తున్న రంగులు.. మెస్మరైజింగ్ వీడియో!
ఇంద్రధనస్సును ప్రతిబింబించేలా చేస్తుందని పేర్కొన్నారు. Hummingbirds' rainbow colors show the beauty of nature

దిశ, వెబ్‌డెస్క్ః ఊసరవెల్లి రంగులు మార్చడం చాలా మందికి తెలుసు, చూసుంటాము. కొన్ని పక్షుల్లోనూ ఇలా రంగులు మారతాయని కొందరికి తెలిసుండొచ్చు. అయితే, ఓ చిన్న హమ్మింగ్ బర్డ్ మార్చే రంగుల్ని చూస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో హమ్మింగ్‌బర్డ్ రంగును మారుస్తూ కనిపిస్తుంది. అందులోనూ ఒక వ్యక్తి వేలిపై వాలి ఇలా రంగులు మార్చుతుంటే చాలా అందంగా కనిపిస్తుంది. వైరల్ హాగ్ ఖాతాలో షేర్ చేసిన ఈ క్లిప్‌లో హమ్మింగ్ బర్డ్ ముదురు ఆకుపచ్చ నుండి నలుపుకు, గులాబీ రంగుకు మారుతుంటుంది. పక్షి తన తలను వేర్వేరు దిశల్లో తిప్పినప్పుడు ఈ రంగు మారడం చూడొచ్చు. ఈ వీడియో యూట్యూబ్ నుండి అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లల్లో షేర్ చేశారు.
కాగా, సైన్స్ డైలీ ప్రకారం, హమ్మింగ్‌బర్డ్‌లు మొత్తం ప్రపంచంలో అత్యంత ముదురు రంగులో ఉండే జంతువులల్లో ఒకటిగా ఉన్నాయి. ఈ పిట్ట రెక్కల్లో రెయిన్‌బో రంగులు, వాటి ఈకలలోని పాన్‌కేక్ ఆకారపు నిర్మాణాల నుండి వస్తాయని నిపుణులు వివరించారు. పక్షి తన తలను వేర్వేరు దిశల్లోకి తిప్పినప్పుడు, రంగుల ఈకల ప్రత్యేక ఆకృతిలోని కాంతి ఇంద్రధనస్సును ప్రతిబింబించేలా చేస్తుందని పరిశోధక వ్యాసంలో పేర్కొన్నారు.






