- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. రూ. 7,059 కోట్ల బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! రూ. 7,059 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు ఆర్థిక శాఖ నిర్ణయం. చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది. గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బకాయిల చెల్లింపులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నిధుల లభ్యతను సమీక్షించి, ప్రాధాన్యత క్రమంలో బకాయిలు విడుదల చేసేలా కసరత్తు పూర్తి చేశారు. ఇందులో భాగంగా మొత్తం రూ. 7,059 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ నిధులతో ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ (PF), ఏపీజీఎల్ఐ (APGLI), మెడికల్ బిల్లుల వంటి అత్యవసర చెల్లింపులు జరగనున్నాయి.
ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే చెల్లింపుల ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగ కుటుంబాలకు పెద్ద ఊరట లభించినట్లయింది. గత కొన్ని ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ (DA) అరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈ నిధుల ద్వారా దశలవారీగా అందనున్నాయి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, పారదర్శకంగా చెల్లింపులు జరుగుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.






