అమెజాన్‌లో భారీ కోత.. 16 వేల మంది ఇంటికి

by Muthe.Rajitha |

అమెజాన్‌లో మరోసారి భారీ ఉద్యోగాల కోత విధించనున్నట్టు సమాచారం.

అమెజాన్‌లో భారీ కోత.. 16 వేల మంది ఇంటికి
X

దిశ, వెబ్ డెస్క్ : అమెజాన్‌లో మరోసారి భారీ ఉద్యోగాల కోత విధించనున్నట్టు సమాచారం. ఈనెల 27 నుంచి దాదాపు 16,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఇప్పటికే గత అక్టోబరులో 14,000 మందిని ఇంటికి పంపగా.. ఇపుడు మిగిలిన 2 వేల మందికి లేఆఫ్స్‌ ప్రకటించనున్నారు. మొత్తం మీద కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈసారి AWS, రిటైల్ ఆపరేషన్స్, HR, అడ్వర్టైజింగ్ వంటి విభాగాలపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది.

AI, ఆటోమేషన్ పెరగడం, ఖర్చులు తగ్గించడం, పాండమిక్ సమయంలో జరిగిన అధిక నియామకాలను సరిచేయడమే దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. దీనిపై అమెజాన్ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా.. ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. టెక్ రంగంలో 2026 ప్రారంభంలోనే పెద్ద లేఆఫ్స్ ట్రెండ్ మొదలవుతుందన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి.

Next Story