అయోధ్య బాలరామునికి భారీ స్వర్ణ ధనుస్సు

by Muthe.Rajitha |

అయోధ్య బాలరామునికి ఒడిశా భక్తులు 286 కిలోల స్వర్ణ ధనుస్సు సమర్పించారు.

అయోధ్య బాలరామునికి భారీ స్వర్ణ ధనుస్సు
X

దిశ, వెబ్ డెస్క్ : అయోధ్య బాలరామునికి ఒడిశా భక్తులు 286 కిలోల స్వర్ణ ధనుస్సు సమర్పించారు. అయోధ్యలోని శ్రీరామ మందిరానికి సమర్పించేందుకు ఈ అత్యంత భారీ స్వర్ణ ధనుస్సును ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ ధనుస్సు బరువు సుమారు 286 కిలోలు కాగా, వ్యయం రూ.1.10 కోట్లుగా అంచనా వేస్తున్నారు. తమిళనాడులోని కాంచీపురంలో సుమారు 40 మంది మహిళా శిల్పకారులు ఎంతో నైపుణ్యంతో, భక్తితో ఈ ధనుస్సును రూపొందించినట్లు సమాచారం. ఈ స్వర్ణ ధనుస్సు ఒడిశాలోని రౌర్కెలా నుంచి "శ్రీ రామ స్వర్ణ ధనుష్ యాత్ర"గా ప్రారంభమై భువనేశ్వర్, బర్గఢ్, రాయగడ, పర్లాకిమిడి మీదుగా పూరీ జగన్నాథ్ మందిరానికి చేరుకుంది.

అయోధ్య మార్గం మధ్యలో ఒడిశాలోని పూరీలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భజనలు, కీర్తనలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. మార్గమంతా “జై శ్రీరాం” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జనవరి 22న ఈ స్వర్ణ ధనుస్సును అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్నారు. ఈ అరుదైన ధనుస్సును దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటం విశేషం.

Next Story