- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒరాకిల్ అధినేత సంపదలో భారీ పతనం.. 6 నెలల్లో ₹18 లక్షల కోట్ల నష్టం!
లారీ ఎలిసన్ సంపదలో రికార్డు స్థాయి కోత! 6 నెలల్లో ₹18 లక్షల కోట్ల నష్టం. ప్రపంచ కుబేరుల జాబితాలో 1వ స్థానం నుంచి 6వ స్థానానికి పతనం.

దిశ, వెబ్ డెస్క్: కొద్ది నెలల క్రితం ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి చేరిన కొద్ది కాలానికే ఒరాకిల్ అధినేత లారీ ఎలిసన్ (Larry Ellison) ఊహించని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో $393 బిలియన్ల సంపదతో ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన ఆయన, గత ఆరు నెలల కాలంలో ఏకంగా $200 బిలియన్లు (సుమారు ₹18 లక్షల కోట్లు) కోల్పోయారు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ $195 బిలియన్లకు పడిపోవడంతో, గ్లోబల్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మొదటి స్థానం నుండి ఆరో స్థానానికి పడిపోయారు. ప్రపంచ టెక్ చరిత్రలోనే ఒక వ్యక్తి ఇంత తక్కువ కాలంలో ఇంత భారీ స్థాయిలో సంపద కోల్పోవడం ఇదే మొదటిసారి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పతనానికి ప్రధాన కారణాలు..
ఈ భారీ నష్టానికి ఒరాకిల్ షేరు విలువ సుమారు 58% మేర కుప్పకూలడం ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల కోసం ఒరాకిల్ చేపట్టిన భారీ వ్యయాలు, పెరుగుతున్న అప్పులు, ఇటీవల ప్రకటించిన దాదాపు 30,000 మంది ఉద్యోగుల తొలగింపు (Layoffs) పెట్టుబడిదారులలో ఆందోళన కలిగించాయి. దీనికి తోడు టెస్లా, పారామౌంట్ స్కైడాన్స్‌లో ఆయనకు ఉన్న ఇతర పెట్టుబడులు కూడా ఈ ఏడాది నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఏకంగా సగం సంపద ఆవిరి కావడాన్ని గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద ‘డౌన్‌ఫాల్’గా పరిగణిస్తున్నారు.






