- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు
కస్టమర్లకు టాటా మోటార్స్ గుడ్ న్యూస్ తెలిపింది. తమ ఎలక్ట్రికల్ వెహికిల్స్(EV)పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : కస్టమర్లకు టాటా మోటార్స్ గుడ్ న్యూస్ తెలిపింది. తమ ఎలక్ట్రికల్ వెహికిల్స్(EV)పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 2026 నెలలో తమ ఎలక్ట్రిక్ వాహనాలపై ఏకంగా రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా కర్వ్ ఈవీ (Curvv EV) సెలెక్ట్ వేరియంట్లపై అత్యధికంగా రూ.3.35 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ.3 లక్షల గ్రీన్ బోనస్‌తో పాటు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా కలిసి ఉన్నాయి.
ఈ ఆఫర్లు కేవలం ఒకే మోడల్‌కే పరిమితం కాకుండా ఇతర ఈవీ కార్లపై కూడా వర్తిస్తాయి. హారియర్ ఈవీ (Harrier EV) మోడల్‌పై రూ.2.75 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుండగా, నెక్సాన్ ఈవీ (Nexon EV)పై రూ.50,000, పంచ్ ఈవీ (Punch EV)పై రూ.95,000, టియాగో ఈవీ (Tiago EV) మోడల్స్‌పై కూడా సంస్థ రూ25,000 ఆఫర్లను ప్రకటిస్తోంది. ముఖ్యంగా మార్కెట్లోకి కొత్తగా వస్తున్న మోడల్స్ కంటే మునుపటి అవుట్‌గోయింగ్ మోడల్స్‌పై ఎక్కువ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ మొత్తం డిస్కౌంట్‌ను గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, స్క్రాపేజ్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ మరియు అదనపు ఇన్‌సెంటివ్స్ వంటి వివిధ కాంపోనెంట్స్ రూపంలో కస్టమర్లకు అందిస్తున్నారు. అయితే ఈ ఆకర్షణీయమైన ఆఫర్లు కేవలం జూన్ నెలలో లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని టాటా మోటార్స్ స్పష్టం చేసింది.






