- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాన్సీ నంబర్లకు భారీ డిమాండ్
రాష్ట్రంలో వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు క్రేజీ డిమాండ్ ఉండటం ఆర్టీఏకు భారీ ఆదాయం తెచ్చిపెట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ వాహన నంబర్ల వేలం రవాణా శాఖకు భారీ ఆదాయం తెచ్చిపెట్టింది. ప్రత్యేక నంబర్లపై వాహన యజమానులు చూపిన ఆసక్తితో ఈ వేలం ద్వారా మొత్తం రూ.31,14,730 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వేలంలో అత్యధిక ధరకు టీజీ09ఎల్0009 నంబర్ దక్కింది. ఈ నంబర్‌ను మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ రూ.10,50,000 చెల్లించి పొందింది. అలాగే టీజీ09ఎల్0007 నంబర్‌ను తిరుపతి రావు పెద్దింటి రూ.3,19,999కు సొంతం చేసుకున్నారు. టీజీ09ఎల్0005 నంబర్‌ను అనిరుధ్ అగ్రో ఫార్మ్స్ లిమిటెడ్ రూ.2,00,005కు, టీజీ09కే9999 నంబర్‌ను ముప్పా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,50,000కు దక్కించుకోగా... టీజీ09ఎల్0024 నంబర్‌ను తిక్కవరపు మంజుల రెడ్డి రూ.1,00,024కు సొంతం చేసుకున్నారు. అలాగే టీజీ09ఎల్0001 నంబర్‌ను అర్జున్ పటేల్ రూ.1,00,000కు పొందారు. ప్రత్యేక నంబర్లపై వాహన యజమానులు భారీ మొత్తాలు చెల్లించేందుకు ముందుకు రావడంతో రవాణా శాఖకు భారీ ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
- Tags
- rta
- fancy numbers






