Hrithik Roshan: కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో స్టార్ హీరో.. మాజీ భార్యతో కలిసి గోవాలో పార్టీ

by Disha Web Desk 12 |
Hrithik Roshan: కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో స్టార్ హీరో.. మాజీ భార్యతో కలిసి గోవాలో పార్టీ
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.. తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌‌తో మంగళవారం ముంబై ఎయిర్‌పోర్టులో చెట్టాపట్టాలేసుకుని కనిపించాడు. అంతేకాదు హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్ సైతం ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ అర్సలన్ గోనితో ప్రత్యక్షమైంది. ఈ రెండు జంటలు నటి పూజా బేడీ హోస్ట్ చేసిన గోవాలో జరిగిన పార్టీ కి హాజరైనట్లు తెలుస్తుండగా.. అక్కడ కలిసే ఎంజాయ్ చేసినట్లు సమాచారం.

ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజా బేడి ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ఈ పిక్స్‌లో హృతిక్ బ్లాక్ టీ-షర్ట్‌‌లో, సబా ఆజాద్ పింక్ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చారు. అయితే వీరు గోవా నుంచి తిరిగొస్తున్న క్రమంలోనే ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కంటపడ్డారు. ఈ నేపథ్యంలో హృతిక్-సుసానే డివోర్స్ తర్వాత చెరొక పార్ట్‌నర్‌ను వెతుక్కున్నట్లు స్పష్టమవుతుండగా.. ఇప్పుడు అంతా కలిసే పార్టీ చేసుకోవడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.



Next Story

Most Viewed