Thyroid: థైరాయిడ్ సమస్యను ఫేస్ చేస్తోన్న పురుషులు.. ఎంతవరకు ఉండాలంటే..?

by Anjali |
Thyroid: థైరాయిడ్ సమస్యను ఫేస్ చేస్తోన్న పురుషులు..  ఎంతవరకు ఉండాలంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత రోజుల్లో చాలా మంది థైరాయిడ్(thyroid) సమస్యతో బాధపడుతున్నారు. ‘‘థైరాయిడ్ గ్రంథి సరైన మొత్తంలో హార్మోన్‌ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల థైరాయిడ్ వ్యాధి వస్తుంది. థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా పెరిగి ముద్ద లేదా నాడ్యూల్‌గా మారడం కూడా థైరాయిడ్ వ్యాధికి కారణమని నిపుణులు చెబుతుండటం చూస్తూనే ఉంటాం. థైరాయిడ్ వ్యాధి వల్ల శక్తి స్థాయి(power level), మానసిక స్థితి(state of mind)పై కూడా ఎఫెక్ట్ చూపుతుంది.

ఏ పని మీద ఆసక్తి చూపకపోవడం, ఆందోళన(worry), అలసట, జుట్టు రాలడం(hair loss), చేతులు వణకడం వంటివి థైరాయిడ్ లక్షణాలు. హైపర్ థైరాయిడిజం(Hyperthyroidism) (ఓవర్ యాక్టివ్ థైరాయిడ్), థైరాయిడ్ నోడ్యూల్స్(Thyroid nodules), థైరాయిడ్ క్యాన్సర్(Thyroid nodules), హైపోథైరాయిడిజం (అండర్ యాక్టివ్ థైరాయిడ్), గాయిటర్(Goiter) (దృశ్యంగా విస్తరించిన థైరాయిడ్ గ్రంథి), వంటివి థైరాయిడ్ వ్యాధి రకాలు.

అయితే థైరాయిడ్ ఎక్కువగా మహిళల్లోనే వస్తుందని వింటుంటాం. మరీ పురుషుల్లో థైరాయిడ్ ఎంతవరకు ఉండాలి..? అనే దానిపై తాజాగా నిపుణులు వెల్లడించారు. . పురుషులలో TSH యొక్క సాధారణ స్థాయి (సబ్‌క్లినికల్ హైపోథైరాయిడిజం) 0.4 mU/L నుంచి 4.0 mU/L వరకు.. అలాగే 18 - 50 ఏళ్ల మధ్య వయస్సు గల మగవారిలో TSH లెవల్ 0.5 – 4.1 mU/L మధ్య ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 51 నుంచి 70 ఏళ్ల వయస్సు గల పురుషులలో, TSH స్థాయిలు 0.5- 4.5 mU/L మధ్య ఉండాలి. అలాగే 70 సంవత్సరాలు పైబడిన మగవారిలో TSH స్థాయిలు 0.4 – 5.2 mU/L ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story