- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Blood cells: తెల్ల రక్త కణాలు మనకు ఏ విధంగా మేలు చేస్తాయి..?
శరీరంలో తెల్ల రక్తకణాలు(White blood cells) వ్యాధులతో పోరాడేలా చేస్తాయి.

దిశ, వెబ్‌డెస్క్: శరీరంలో తెల్ల రక్తకణాలు(White blood cells) వ్యాధులతో పోరాడేలా చేస్తాయి. వైరస్‌లు(Viruses) అండ్ మానవ శరీరంపై దాడి చేసినప్పుడు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఈ కణాలు మన రక్తం మొత్తం పరిమాణంలో 1% ఉంటాయి. ఒక మైక్రోలీటర్ రక్తం(microliter of blood)లో 4,500 మరియు 11,000 తెల్ల రక్తకణాలు ఉంటే ఒక వ్యక్తి సాధారణ తెల్ల రక్త కణాల సంఖ్యను కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా (Bacteria)శరీరంపై దాడి చేసినప్పుడు తెల్లరక్తకణాలు మొదటగా చురుగ్గా ఉంటాయి. ఎముక మజ్జలో కూడా ఇవి ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
బాడీలో తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గినట్లైతే.. శరీరంలో ఇన్ఫెక్షన్ (Infection)చాలా వేగంగా వ్యాపిస్తుంది. కాగా తెల్ల రక్తకణాలకు పెరిగేందుకు పలు ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్నో రోగాలను తరిమికొట్టేందుకు తెల్ల రక్త కణాలు బాగా మేలు చేస్తాయి. తెల్ల రక్త కణాలు మీ రక్తంలో భాగం. అవి మీ రోగనిరోధక వ్యవస్థ(immune system)ను పెంచడంలో కూడా ఓ భాగమవుతాయి. ఇది ఇన్ఫెక్షన్‌లను గుర్తించి, వాటిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. విభిన్న పాత్రలను పోషించే వివిధ రకాల తెల్ల రక్త కణాలు ఉన్నాయి. మీకు తక్కువ లేదా అధిక సంఖ్యలో తెల్ల రక్త కణాలు ఉంటే అది అంతర్లీన సమస్యను సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






