రోడ్డు ఇలా.. వెళ్లేది ఎలా..?

by Jakkula.Mamatha |

మండల కేంద్ర పరిధిలో ఉన్న శిరూర్ మంజీరా నది బ్రిడ్జి నుంచి నాగ్వర్ గ్రామ శివారులోని ఎస్బీఎఫ్ కాటన్ పత్తి మిల్లు వరకు జాతీయ ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు ఆర్ అండ్ బి అధికారులు రోడ్డును తవ్వారు.

రోడ్డు ఇలా.. వెళ్లేది ఎలా..?
X

దిశ, రాయికోడ్: మండల కేంద్ర పరిధిలో ఉన్న శిరూర్ మంజీరా నది బ్రిడ్జి నుంచి నాగ్వర్ గ్రామ శివారులోని ఎస్బీఎఫ్ కాటన్ పత్తి మిల్లు వరకు జాతీయ ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు ఆర్ అండ్ బి అధికారులు రోడ్డును తవ్వారు. గడిచిపోయిన వర్షాకాలం అంత కూడా గుంతలుగా మారిన రోడ్డుపై ప్రయాణికులు నరకయాతన చూశారు. పోయిన వర్షాకాలం అలా గడిచిపోగా గత నెల రోజులుగా మళ్ళీ రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు గుంతలుగా మారిన రోడ్డుపై సుమారు 5 కిలోమీటర్ల వరకు దొడ్డు కంకర పరచి పనుల్లో తీవ్రంగా జాప్యం చేస్తున్నారు.

ఓ వైపు కంకర రాళ్లలో ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేయలేక నరకం చూస్తూ కాలి నడక ప్రయాణం చేస్తున్నారు. కంకర రోడ్డు పై పెద్ద వాహనాలు ప్రయాణం సాగిస్తూ ఉండగా కంకర రాళ్ళు ఎగిరి తగిలి ప్రయాణికులు గాయాలపాలవుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు అధికారులకు పట్టవా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై బీదర్, నారాయణఖేడ్, ముంబాయి, హైదరాబాద్, జహీరాబాద్ వంటి పట్టణాలకు నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణంలో జాప్యం చేయకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

Next Story