Allu Arjun: అల్లు అర్జున్ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎలా సంపాదించుకున్నాడు?

by Phanindra |   (  Updated:2024-11-23 09:14:55  IST  )

పాట్నాలో విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ కి ఎవరూ ఊహించని విధంగా జనాలు వచ్చారు.

Allu Arjun: అల్లు అర్జున్ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎలా సంపాదించుకున్నాడు?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) పుష్ప 2 ( Pushpa 2 ) మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ఉరుకులు పరుగులు పెడుతూ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే, ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయగా యూట్యూబ్ లో రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసింది. పాట్నాలో విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ కి ఎవరూ ఊహించని విధంగా జనాలు వచ్చారు. అలాగే, పుష్ప 2 మూవీ పాటలు కూడా ట్రెండ్ అవుతున్నాయి.

అందరి చూపు ఇప్పుడు పుష్ప 2 పైనే ఉంది. అసలు అల్లు అర్జున్ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎలా సంపాదించుకున్నాడంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. పుష్ప మూవీ పార్ట్ 1 లో డైలాగ్స్ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యాయి. దేశమంతటా తగ్గేదే లే అనే ఒక్క డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఇదే కాకుండా పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ కూడా రీల్స్ లో బాగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు, పుష్ప 2 కి మూవీ మేకర్స్ ఎక్కువ కష్ట పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో దుమ్ము దులుపుతుంది. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ నవంబర్ 24 న సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని సాయి రామ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయనున్నారు.


Read More..

Movies: కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. కానీ, అందరూ పుష్ప 2 కోసమే వెయిట్ చేస్తున్నారా?



Next Story