- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అశ్వాపురంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గ్రామపంచాయతీ పరిధిలోని బడుగు బజార్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

దిశ, అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గ్రామపంచాయతీ పరిధిలోని బడుగు బజార్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని అందించి కుటుంబ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యులు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తి శ్రద్ధల మధ్య మడేలేశ్వర స్వామి జాతరలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్వో సూర్యప్రకాష్, ఎంపీడీవో ముత్యాల రావు, హౌసింగ్ ఏఈలు ఉదయ్ కుమార్, భరత్ కుమార్, గ్రామ కార్యదర్శి యాకుబ్, ఓరుగంటి బిక్ష్మయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, సర్పంచ్‌లు బనోత్ సదర్లాల్, ఏనిక ఉషారాణి, ఇర్పా కవిత, కుంజా జాను, కూడా కృష్ణ, ఉపసర్పంచ్‌లు హర్షా నాయక్, శీలం సంజీవ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు సోడే వెంకటేశ్వర్లు, కాకా రాములు, జినకా నాగయ్య, నాయకులు తెల్లం వీరభద్రం, ఏనిక రవి, తెల్లం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






