- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల పరిధిలోని పత్తేపురం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

దిశ, తొర్రూర్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల పరిధిలోని పత్తేపురం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన కోనేటి వెంకటయ్య తన ద్విచక్ర వాహనం పై తొర్రూర్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో పత్తేపురం గ్రామ సమీపానికి చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఆయన బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటయ్య తలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోయాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించిన అనంతరం వెంకటయ్యను మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.






