రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం: ముగ్గురి దుర్మరణం

by Batti.Sumithra |

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని రాజీవ్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఓ బాలిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది.

రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం: ముగ్గురి దుర్మరణం
X

దిశ, కొండపాక : సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని రాజీవ్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఓ బాలిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు రోడ్డు దాటుతున్న మతిస్థిమితం లేని అరె రాధవ్వ (60) అనే మహిళను తప్పించబోయే క్రమంలో ఆమెను ఢీ కొట్టింది.

అనంతరం అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఇంటి ముందు కూర్చున్న కెమ్మసారం లచ్చవ్వ (65) అనే మహిళను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాధవ్వ, లచ్చవ్వలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అదే సమయంలో సమీపంలో ఆడుకుంటున్న ఓ బాలికను కూడా కారు ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలే కాగా, వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషాద ఘటనతో దుద్దెడ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story