బాబా సాగర్ వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

by Batti.Sumithra |

పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన ఇద్దరు కూలీలను మృత్యువు కబళించింది.

బాబా సాగర్ వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ, కాగజ్ నగర్ : పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన ఇద్దరు కూలీలను మృత్యువు కబళించింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం బాబాసాగర్-డబ్బా ప్రధాన రహదారి పై మంగళవారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ స్తంభాల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు కూలీలు స్తంభాల కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులిద్దరూ సుమారు 50 సంవత్సరాల వయస్సు కలిగిన వారు.

కెరమెరి నుంచి చింతలమానేపల్లి వైపు పంట పొలాల్లో పెన్షన్ వైర్లు అమర్చే పనుల కోసం సిమెంట్ స్తంభాలను లోడ్ చేసుకుని వెళ్తున్న ట్రాక్టర్, బాబా సాగర్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్‌లో ఉన్న భారీ సిమెంట్ స్తంభాలు పైపడటంతో ఇద్దరు కూలీలు వాటి కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో నలుగురిని స్థానికులు తక్షణమే స్పందించి 108 వాహనంలో అత్యవసర చికిత్స నిమిత్తం కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story