- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope:ఈ రోజు(16-07-2026) రాశి ఫలాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జులై 16వ తేదీ గురువారం రోజున 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జులై 16వ తేదీ గురువారం రోజున 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరిగినప్పటికీ, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో పైఅధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.
మిథున రాశి
ఈ రోజు కొద్దిగా ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండండి. లేకపోతే సమస్యలు ఎదురు కావచ్చు. వ్యాపారస్తులకు సాధారణ లాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. కుటుంబంలో శుభకార్యాల గురించిన చర్చలు జరుగుతాయి. మిత్రుల సహాయంతో ఒక ముఖ్యమైన సమస్య తీరుతుంది.
సింహ రాశి
వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రోజు అద్భుతమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. నూతన వస్తువు లేదా వాహన కొనుగోలుకు ప్రణాళికలు వేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య రాశి
ఈ రోజు పనులలో కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా దైవచింతన అలవర్చుకోండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవడం ముఖ్యం. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
తుల రాశి
మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. వృత్తిపరంగా కొత్త బాధ్యతలు చేపడతారు. తోబుట్టువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఇవాళ కొద్దిగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమయపాలన పాటించడం ద్వారా పనులను సక్రమంగా పూర్తి చేయగలరు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
మకర రాశి
ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన పరిచయాలు వ్యాపార రీత్యా కలిసివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
కుంభ రాశి
ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. జీవితభాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మీన రాశి
ఈ రాశి వారికి ఇవాళ ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త వహించండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారంలో ఊగిసలాట ధోరణి వీడాలి. శారీరక శ్రమ పెరిగినా, చివరికి పనులు అనుకూలంగా పూర్తవుతాయి.






