- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, బషీరాబాద్: తన పండ్ల బండి దగ్గర మర్చిపోయిన 92 వేల రూపాయలను నిజాయితీగా తిరిగి ఇచ్చిన హైమద్ ను బషీరాబాద్ కి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు అభినందించారు. అనంతరం అతడి నిజాయితీని మెచ్చుకొని 20వేల రూపాయల విలువ చేసే టైటాన్ వాచ్ ను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ రావు మాట్లాడుతూ ఈరోజుల్లో నిజాయితీగా ఉండేవారు చాలా అరుదు అని, పండ్ల వ్యాపారం చేస్తున్నా కూడా డబ్బులకు ఆశపడకుండా ఆ డబ్బులు ఇవ్వడం అనేది గొప్ప విషయం అంటూ కొనియాడారు.
Next Story






