- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెచ్ఎండీఏ ఆఫీసు పైగా ప్యాలెస్‌కు తరలింపు?
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆథారిటీ(హెచ్ఎండీఏ) హెడ్ ఆఫీ సుకు బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌కు తరలించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆథారిటీ(హెచ్ఎండీఏ) హెడ్ ఆఫీ సుకు బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌కు తరలించనున్నారు. అయితే గతంలో పైగా ప్యా లెస్‌ను హైడ్రా ప్రధాన కార్యాలయానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే రూ.70 కోట్లతో మరమ్మతు లు చేయాలని నిర్ణయించారు. కానీ హైడ్రా ఆఫీసును బుద్ధభవన్‌లో కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పైగా ప్యాలెస్ కు హెచ్ఎండీఏ ఆఫీసును తరలించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే పైగా ప్యాలెస్ రిపేర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మార్చి నుంచి తరలించే పనులు ప్రారంభమైతే జూన్‌లోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. 15 ఏండ్ల క్రి తం పైగా ప్యాలెస్‌లోనే హెచ్ఎండీఏ ఆఫీసు ఉండగా, తిరిగి మళ్లీ అక్కడికే వెళ్లనుంది. దీంతో స్వర్ణజయంతి కాంప్లెక్స్‌ను మళ్లీ రెం ట్‌కు ఇవ్వాలని నిర్ణయించారు.
1900లో నిర్మాణం
బేగంపేట చిరాన్‌లేన్‌లోని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పైగా ప్యాలెస్ రాజభవన్‌లా ఉంటుంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పని చేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్ నిర్మించారు. ఉమ్రా పైగా వంశానికి చెందినవారు కావడంతో దీనికి పైగా ప్యాలెస్‌గా గుర్తించారు. అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలిలో ప్యాలెస్ నిర్మించారు. ఈ ప్యాలెస్‌కు 22 అడుగుల ఎత్తయిన పైకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులున్నాయి.
హుడా ఆఫీసు ఇక్కడే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) ఏర్పాటు చేశారు. హుడా ఆఫీసును మొదటగా పైగా ప్యాలెస్‌లోనే ఏర్పాటు చేశారు. నిజాం పాలన తర్వాత పైగా ప్యాలెస్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో హుడా ఆఫీసుకు ఇచ్చారు. హుడాకు తొలి చైర్‌పర్సన్‌గా సరోజినీ పుల్లారెడ్డి ఉండగా, తొలి వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి వసంత్ బవాను ప్రభుత్వం నియమించింది. హుడాను 7 జిల్లాలతో కలిపి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)గా ఏర్పాటు చేశారు. అయితే హుడా ఆఫీస్ (పైగా ప్యాలెస్)ను అమెరికన్ కాన్సులేట్ ఆఫీసుకు అప్పగించారు. దీంతో హెచ్ఎండీఏ ఆఫీసును తార్నాకలోని హుడా కాంప్లెక్స్‌లోకి తరలించారు. 12 ఏండ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆఫీసులోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోకి తరలించింది. ఇక్కడి నుంచి హెచ్ఎండీఏ ఆఫీసును మళ్లీ పైగా ప్యాలెస్‌కు తరలించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
హెచ్ఓడీలకు మాత్రమే
పైగా ప్యాలెస్‌ను పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తయ్యేవరకు అన్ని విభాగాల హెచ్ఓడీలకు మాత్రమే ఆఫీసులు కేటాయించాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ కమిషనర్‌కు మెట్రోరైలు ఎండీగా బాధ్యతలు అప్పగిండంతో బేగంపేట్‌లోని మెట్రో భవన్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. మీటింగ్‌లు సైతం అక్కడే నిర్వహిస్తున్నారు. దీంతో అమీర్‌పేట్ నుంచి బేగంపేట్‌కు రావడానికి సమయం వృథా అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే పైగా ప్యాలెస్‌లో హెచ్ఓడీలు ఉంటే బేగంపేట్ లోని మెట్రోభవన్ రావడం సౌలభ్యంగా ఉంటుంది. అందులో భాగంగానే పైగా ప్యాలెస్ మరమ్మతులు స్పీడ్ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు.
అర్బన్ ఫారెస్ట్రీ, హెచ్‌జీసీఎల్ ఆఫీసులు
హెచ్ఎండీఏలో కీలక విభాగాలైన అర్బన్ ఫారెస్ట్రీ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఆఫీసులు నానక్ రాంగూడలో ఉన్నాయి. ఈ రెండింటిని పైగా ప్యాలెస్‌కు తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యంగా అర్బన్ ఫారెస్ట్రీ ఆఫీసును మాత్రం పూర్తి స్థాయిలో తీసుకురావాలని నిర్ణయించారు. హెచ్‌జీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) ఆఫీసుతోపాటు కొంత మంది స్టాఫ్‌ను పైగా ప్యాలెస్‌లో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నుంచి అన్ని విభాగాల తరలింపు కార్యక్రమం ప్రారంభమవుతోందని, అన్ని విభాగాలను తరలించడానికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశముంది.






