టీ20 వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక విజయం: టీం ఇండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

by Malleboina Mahesh |

టీం ఇండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా! న్యూజిలాండ్‌ను ఓడించి 3వ సారి టీ20 వరల్డ్ కప్ నెగ్గిన భారత్. రికార్డు విజయం.

టీ20 వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక విజయం: టీం ఇండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium)లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో భారత జట్టు న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయంతో భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ (BCCI) రూ. 131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ విజయంతో టీం ఇండియా వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా, టీ20 ప్రపంచ కప్ చరిత్రలో మూడుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ అద్భుత ప్రయాణంలో పాలుపంచుకున్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సెలక్టర్లు, సపోర్టింగ్ స్టాఫ్‌ను బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవాజిత్ సైకియా అభినందించారు. దేశానికి గర్వ కారణంగా నిలిచిన ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ భారీ నజరానాను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. పొట్టి ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

Next Story